News April 13, 2025
కొమరాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొమరాడ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన బిడ్డ లక్ష్మణ్ మృతి చెందారు. రాయగడ వైపు నుంచి పార్వతీపురం వస్తున్న లారీ రహదారి పక్కగుండా నడిచి వెళ్తున్న బిడ్డ లక్ష్మణను ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మణ్ వంటిపై నుంచి లారీ వెళ్లడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కొమరాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2026
పాలమూరు: రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల సడలింపు

రాష్ట్రంలోని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 4:00 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులు 19-02-2026 నుంచి 20-03-2026 వరకు అమలులో ఉంటాయి. అయితే, అత్యవసర సేవలలో ఉన్న సిబ్బందికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.
News February 17, 2026
జీ.మాడుగుల: రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

జీ.మాడుగుల మండలం వంజరి పంచాయతీ ములకాయపుట్టు వద్ద గల జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైవే పనులు నిమిత్తం వచ్చిన ట్రాలీ లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2026
సర్వే 2026 రికార్డుల్లో నిగూఢ నినిదాలు.. బఫర్ జోన్ మార్కింగ్‌లో మెలిక!

హైదర్షాకోట్-అత్తాపూర్ వరకు ఎర్ర గీతల వెనుక ఉన్న ‘టెక్నికల్’ చిక్కుముడి. మున్సిపల్ శాఖ జారీ చేసిన తాజా ఇంటర్నల్ సర్క్యులర్ ప్రకారం.. మూసీ గరిష్ట వరద మట్టం గుర్తింపులో కొత్త సాఫ్ట్‌వేర్ వాడుతున్నారని తెలిసింది. ఇక్కడే చట్టపరమైన చిక్కుముడి ఉంది. దశాబ్దాల క్రితం ఉన్న రెవెన్యూ మ్యాపులకు ఇప్పటి గూగుల్ శాటిలైట్ మ్యాపులకు పొంతన కుదరడం లేదు. వందలాది ‘లీగల్’ ప్రాపర్టీలు కూడా బఫర్ జోన్‌లోకి వస్తున్నాయి.


