News April 1, 2025
కొమరాడ: 45 రోజుల కష్టం.. రోజుకు రూపాయి

కొండ చీపుర్లకు మద్ధతు ధర పలకడం లేదని తయారీదారులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గిరిజన ప్రాంతాల ప్రజలు కొండ చీపుర్లు కొనుగోలు చేసి జీవనం సాగిస్తుంటారు. 45 రోజులు పాటు కష్టపడి తయారు చేస్తే ఒక్కో చీపురును దళారులు రూ.40కి కొనుగోలు చేసి బయట రూ.70 వరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జీసీసీ ద్వారా కొండ చీపుర్లను మద్దతు ధరకు కొనుగోలు కొనగోలు చేయాలని వేడుకున్నారు.
Similar News
News April 2, 2025
KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
News April 2, 2025
విజయనగరం: ‘ఉద్యాన పంటల సాగు పెంచేందుకు కార్యాచరణ’

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత జిల్లా పరిస్థితులను బట్టి వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఉద్యానసాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం తమ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
News April 2, 2025
అంజలి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా

AP: AGM వేధింపులు తట్టుకోలేక రాజమండ్రిలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని అంజలికి అండగా ఉంటామని YS జగన్ వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని ఇవాళ తనను కలిసిన ఆమె కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధితురాలి పేరెంట్స్ కోరారు. పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.