News April 21, 2025

కొమురం భీమ్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా తిర్యాని 43.9 ఉష్ణోగ్రత నమోదు కాగా పెంచికల్‌పేట, వాంకిడి 43.8, బెజ్జూరు 43.7, ఆసిఫాబాద్, కౌటాల, కెరమెరి లో 43.7, దహేగాం, రెబ్బెన 43.5, సిర్పూర్ టి 43.4, కాగజ్నగర్ 43.2, జై నూర్ 42.8, చింతల మానేపల్లి 42.7, సిర్పూర్ యు 42.6, లింగాపూర్ 41.4 గా నమోదయింది.

Similar News

News April 21, 2025

నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

image

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.

News April 21, 2025

అనకాపల్లి: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్!

image

అనకాపల్లి జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

News April 21, 2025

రాజన్న సిరిసిల్ల: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281.

error: Content is protected !!