News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
Similar News
News March 16, 2025
జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News March 16, 2025
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ క్రాంతి

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోధన తీరని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
News March 16, 2025
తాడూర్: విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు తెలకపల్లి తెలంగాణ మహాత్మ జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తొమ్మిదవ తరగతిలో 2025-26 సంవత్సరానికి మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు తాడూర్ గురుకుల ప్రిన్సిపల్ రష్మీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31వ తారీఖు చివరి తేదీ అని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 6వ తరగతి ప్రవేశానికి 12 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు.