News February 9, 2025

కొమురవెల్లిలో బందోబస్తును పరిశీలించిన ఏసీపీ

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నాల్గవ ఆదివారం సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు.

Similar News

News November 15, 2025

అమరావతిలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ స్టేడియం

image

రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్‌తో AIFF ఛైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం ప్రారంభించనున్నట్టు చౌబే వెల్లడించారు. గ్రాస్‌రూట్స్ ఫుట్‌బాల్‌ కోసం పీఈటీ‌లకు శిక్షణ, కోచ్‌ల గ్రేడింగ్‌లో APతో భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.
ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డీఎస్సీలో 3% రిజర్వేషన్ ఇచ్చామని లోకేశ్ ఆయనకు తెలిపారు.

News November 15, 2025

ఎల్లుండి క్యాబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై చర్చ

image

TG: రాష్ట్ర మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయంతో జోష్‌లో ఉన్న హస్తం పార్టీ.. త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపైనే చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే.

News November 15, 2025

భీమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన

image

వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్ రమాదేవి శుక్రవారం పరిశీలించారు. పట్టణ సీఐ వీరప్రసాద్‌తో కలిసి టికెట్ బుకింగ్ కౌంటర్, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు, లడ్డు తయారీ విభాగం వంటివి పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. భక్తుల రద్దీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఐ వీరప్రసాద్ ఆలయ సిబ్బందికి సూచనలు చేశారు.