News April 7, 2024
కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు బోనాలు, పట్నాలు, గంగిరేగు చెట్టుకు ముడుపులు, ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.
Similar News
News December 25, 2024
రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి: వరంగల్ సీపీ
వరంగల్ సీపీ అంబ కిషోర్ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రత దృష్ట్యా రాత్రి వేళలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతం మొక్కను నాటారు.
News December 24, 2024
వరంగల్: పెరిగిన సరకుల ధరలు
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,510 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర సోమవారం రూ.16,000 పలకగా, నేడు రూ. 16,200 పలికినట్లు రైతులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News December 24, 2024
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు సోమవారం రూ.15,200 ధర రాగా.. ఈరోజు రూ.15,800 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకి నిన్న రూ.13,500 ధర రాగా నేడు రూ.12,500 ధర పలికింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,500 ధర పలకగా మంగళవారం రూ.13,500 పలికింది.