News February 5, 2025

కొమురవెల్లి: గుండెపోటుతో టీచర్ మృతి

image

సిద్దిపేట జిల్లాలో గుండెపోటుతో టీచర్ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం మరి ముచ్చాల గ్రామానికి చెందిన అశోక్(50) టీచర్. ఇటీవలే కొమరవెల్లి ZPHS ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన దుబ్బాక మండలం దుంపలపల్లి పాఠశాలకు పీఈటీగా బదిలీపై వెళ్లారు. కాగా ఈ ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News February 21, 2026

రేపు జిల్లాకు వర్ష సూచన

image

కుమురంభీం జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తిని రైతులు రాబోయే రెండు రోజుల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News February 21, 2026

డిఫమేషన్ కేసులో రాహుల్‌కు ఊరట

image

పరువు నష్టం (డిఫమేషన్) కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. శనివారం మహారాష్ట్రలోని భీవండి కోర్టులో విచారణ జరగ్గా ఆయనకు బెయిల్ మంజూరైంది. మహాత్మా గాంధీ హత్య వెనుక RSS హస్తం ఉందని రాహుల్ 2014లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దీనిపై విచారణ నిమిత్తం రాహుల్ కోర్టుకు హాజరయ్యారు.

News February 21, 2026

AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

image

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.