News September 22, 2025

కొమురవెల్లి: ప్రేమ విఫలం యువకుడి ఆత్మహత్య

image

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమురవెల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గౌరాయిపల్లికి చెందిన పెద్ది మధుసూదన్ రెడ్డి(23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి ఇంట్లో ప్రేమ విషయం తెలవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

Similar News

News September 22, 2025

సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్

image

TG: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 30 వేల మంది ఒప్పంద కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

News September 22, 2025

తిరుపతి కలెక్టర్‌కు అభినందనలు వెల్లువ

image

తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శనివారం ఢిల్లీలో స్కోచ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే‌. నారావారిపల్లెలో 1,600 ఇండ్లకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయడంలో ఆయన కృషికి అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ మౌర్య కలెక్టరేట్‌లో కేక్ కట్ చేశారు‌. కలెక్టర్‌కు వారు అభినంధనలు తెలిపారు.

News September 22, 2025

గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన

image

గాజులరామారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్కడ నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారన్నారు. ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని, కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని రంగనాథ్‌ తెలిపారు. కబ్జా చేసిన వాటిలో 30శాతమే కూల్చేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనన్నారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.