News December 31, 2024
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.16.50 లక్షలు
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.16.50 లక్షల మేరకు బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తలనీలాల సమర్పణ, ఆర్జిత సేవలు, పట్నాలు, బోనాలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల అద్దె, ప్రసాద విక్రయాలు ఇతర ద్వారా ఆదివారం రూ. 13.40 లక్షలు, సోమవారం లక్ష రూపాయల బుకింగ్ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
Similar News
News January 4, 2025
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరం: WGL కలెక్టర్
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరమని కలెక్టర్ సత్య శారదా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పాత్రికేయులతో(ముఖా ముఖి) కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలకు గురైన పాత్రికేయులు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
News January 3, 2025
వరంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా మంత్రులు
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎంను మంత్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News January 3, 2025
క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా
సచివాలయంలో తెలంగాణ బయో డైవర్సిటి బోర్డ్ నూతన క్యాలెండర్లను అధికారులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, తెలంగాణ బయోడైవర్సిటి బోర్డు ఛైర్మన్ కాళిచరణ్, తదితరులు పాల్గొన్నారు.