News January 31, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం @రూ.58,47,941

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 15 రోజుల్లో రూ.58,47,941 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 31 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 11 క్వింటాళ్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
పెరిగిన ఓటింగ్ శాతం.. ఎవరికి సానుకూలం?

బిహార్లో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ 57.29శాతం కాగా ఇవాళ జరిగిన ఫస్ట్ ఫేజ్లో సా.5 గంటల వరకే 60.13శాతం పోలింగ్ నమోదైంది. సా.6 గంటల వరకు లెక్కేస్తే ఇది మరింత పెరగనుంది. దీంతో పర్సంటేజ్ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమకే సానుకూలమంటూ JDU-BJP నేతృత్వంలోని NDA, RJD-INC నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News November 6, 2025
సోన్: నీటి కుంటలో జారి పడి మహిళ మృతి

సోన్ మండలం, వెల్మల్ గ్రామానికి చెందిన మూడ సాయవ్వ (47) గురువారం బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటికుంటలో జారిపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
News November 6, 2025
జనగామ జిల్లాలో రేపు ‘వందే మాతరం’ సామూహిక గీతాలాపన

మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సామూహిక గీతాలాపన చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


