News December 30, 2025

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.1,15,42,056

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామివారికి 49 రోజుల్లో రూ.1,15,42,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేశ్ తెలిపారు. 60 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 50విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 31, 2025

రేపు అరుదైన తేదీ.. మళ్లీ పదేళ్ల తర్వాతే!

image

కొత్త ఏడాది తొలిరోజే ఒక వింతైన తేదీతో ప్రారంభం కానుంది. జనవరి 1వ తేదీని 2026 సంవత్సరంతో కలిపి చూస్తే సంఖ్యా శాస్త్రం ప్రకారం 1/1/1 కోడ్ కనిపిస్తుంది (2+0+2+6=10; 1+0=1). ఇలాంటి అద్భుతమైన తేదీ రావడం ఇదే తొలిసారి. మళ్లీ ఇలాంటి అరుదైన తేదీ కోసం 2035 వరకు వేచి చూడాల్సిందే. ఈ విశేషమైన రోజున మీ కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టండి. SHARE IT

News December 31, 2025

శ్రీకాకుళం: ఈ రైడ్ సేఫేనా?

image

చోదకులు హెల్మెట్ ధరించక యాక్సిడెంట్‌ల్లో ప్రాణాలొదిలిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో తరచూ జరగుతుంటాయి. హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు అవగాహన కల్పించినా..పెడచెవిన పెట్టి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు హెల్మెట్ ఉన్నా..బైకులు పక్కన పెట్టి డ్రైవింగ్ చేయడం శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ కనిపించింది. పోలీసులు, ఫైన్‌ల నుంచి తప్పించుకోవడానికి తప్ప, వ్యక్తిగత భద్రతకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

News December 31, 2025

NEW YEAR: అతిగా తాగేసి ఇబ్బంది పడితే!

image

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి <<18724599>>సమస్యలు<<>> ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అల్లం టీ వికారాన్ని, అరటిపండు నీరసాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకుని కాసేపు నిద్రపోతే హ్యాంగోవర్ తగ్గుతుంది. share it