News January 23, 2025
కొమురవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

DCM, బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయలైన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైక్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 28, 2026
ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 28, 2026
NZB: ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలి

GGHలో కొనసాగుతున్న ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన మాతాశిశు ఆరోగ్య కేంద్రం (MCH), క్రిటికల్ కేర్ యూనిట్‌లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. సుదీర్ఘ కాలం నుంచి పలు పనులు పెండింగ్‌లోనే ఉండడం గమనించిన సుదర్శన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.


