News March 29, 2025

కొమురవెళ్లి మల్లన్న ఆదాయం రూ.1,11,96,965

image

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 21 రోజుల్లో రూ.1,11,96,965 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 112 గ్రాముల మిశ్రమ బంగారం, 9 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 24 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 20 క్వింటాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, టీజీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 4, 2025

అమలాపురం: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి ఎస్పీ కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News July 4, 2025

ఏలూరు: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

image

ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

News July 4, 2025

ఖమ్మం: ఆయిల్‌పామ్‌ సుంకంపై కేంద్రమంత్రికి తుమ్మల లేఖ

image

ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్రం మే 31న ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకొస్తారని లేఖలో పేర్కొన్నారు.