News November 17, 2025

కొమురవెళ్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

image

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం, జాతర తేదీలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. మల్లన కల్యాణోత్సవం డిసెంబర్ 14న ఉదయం 10.45 నిముషాలకు జరగనుంది. అలాగే స్వామి వారి జాతర 2026 జనవరి 14 నుంచి 18 వరకు జరగనుందని ప్రకటించారు. స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

Similar News

News November 17, 2025

పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

image

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.

పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.