News June 16, 2024

కొమ్మనాపల్లిలో మరో 28 మందికి డయేరియా

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. శనివారం మరో 28 మంది దీని బారిన పడినట్లు తెలిసింది. కాకినాడలోని జీజీహెచ్‌లో 16 మంది, తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఊరిలో 512 కుటుంబాల్లో 1881 మంది ఉన్నారు. వారిలో 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతుంది. పలువురు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నారు.

Similar News

News October 3, 2024

వదంతులు నమ్మొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

image

చిరుత పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు, మండపేట టౌన్ SI హరికోటి శాస్త్రితో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిస్తే 18004255909కి ఫోన్ చేయమని తెలిపారు.

News October 2, 2024

ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారు: మాజీ ఎంపీ భరత్

image

ప్రజల్లో ఎన్నో ఆశలు రేపి కూటమి అధికారంలోకి వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు. కానీ ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అమ్మకు సున్నం.. నాన్నకు మద్యం.. అన్న విధంగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు

News October 2, 2024

రాజమండ్రి: ‘చమురు సంస్థల నుంచి పరిహారం ఇప్పించాలి’

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న పలువురు మత్స్యకారులకు చమురు సంస్థలు నుంచి పరిహారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులందరికి పరిహారం ఇప్పించాలని కోరారు.