News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.
Similar News
News February 11, 2026
MLA, MLCల కుటుంబాలతో లోకేశ్ డిన్నర్!

AP: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. MLA, MLC కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయ విందులో పాల్గొనాలని యోచిస్తున్నారు. ప్రతిరోజూ ఏడుగురు MLAలు, MLCలతో ఆయన భేటీ కానున్నారు. సభ్యులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ముగిసేలోపు ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News February 11, 2026
చౌటుప్పల్: పోటెత్తిన ఓటర్లు.. రికార్డు బద్దలవుతుందా?

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చివరి దశలో హోరాహోరీగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 79.28 శాతం ఓటింగ్ నమోదు కాగా, చివరి గంటల్లో ఓటర్లు భారీగా క్యూ కడుతున్నారు. గతంలో నమోదైన 93 శాతం రికార్డును ఈసారి అధిగమిస్తారో లేదోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొంటుండటంతో ఓటింగ్ శాతం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
News February 11, 2026
T20WC: ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

కొలంబోలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 45 రన్స్‌తో స్టొయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇంగ్లిస్(37), రెన్షా(37) రాణించారు. మార్క్ ఆదైర్ 2 వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ గెలవాలంటే 183 పరుగులు చేయాలి.


