News March 15, 2025

కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తులు

image

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ మొక్కులు లక్ష్మీ నరసింహ స్వామికి చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలా వసతులు కల్పించామని ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.

Similar News

News July 7, 2025

వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

News July 7, 2025

వరంగల్: క్వింటా పసుపు రూ.12,659

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News July 7, 2025

వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

image

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.