News March 17, 2025

కొమ్మాల జాతరలో తప్పిపోయిన బాలుడి అప్పగింత

image

వరంగల్ రంగశాయిపేటకు చెందిన నరేశ్ భార్య, పిల్లలతో కొమ్మాల జాతరకు వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. కొమ్మాల జాతరకు భక్తులు భారీసంఖ్యలో తరలి రావడంతో సందడిగా మారింది. అనంతరం షాపింగ్ చేస్తుండగా వారి మూడేళ్ల బాబు తప్పిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన గీసుగొండ సీఐ మహేందర్ వెంటనే పోలీస్ టీంను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడి ఆచూకీని తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.

News February 21, 2026

T20WC.. సూపర్-8లో మ్యాచ్ రద్దయితే?

image

T20WC సూపర్-8లో ప్రతి జట్టు 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేదు. అందువల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. లేదా ఇతర గేమ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా ఇవాళ జరగాల్సిన న్యూజిలాండ్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభమవలేదు. గ్రూప్-1లో IND, SA, WI, ZIM, గ్రూప్-2లో ENG, NZ, PAK, SL ఉన్నాయి.

News February 21, 2026

RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

image

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.