News October 16, 2025

కొయ్యలగూడెం: ఆవుకి కవల దూడలు జననం

image

కొయ్యలగూడెంలోని పరింపూడి పశువైద్యశాల వద్ద ఆవు అరుదైన కవలలకు (ఒక పెయ్య, ఒక గిత్త దూడ) జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆవు ఇబ్బంది పడగా, వైద్యాధికారి బి.ఆర్. శ్రీనివాస్ ట్రాక్టర్ హైడ్రాలిక్ సహాయంతో ఆవును పైకి ఎత్తి ప్రసవం అయ్యేలా కృషి చేశారు. ఈ ప్రత్యేక ప్రయత్నానికి రైతులు వైద్యాధికారి, సిబ్బందిని అభినందించారు.

Similar News

News October 16, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

* రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇప్పటికే షూట్ పూర్తయింది
* ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 23న ‘ఫౌజీ’ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి.
* మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి ఫుట్‌పాల్ పెరిగిందని, కానీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలు ఎంతో కష్టపడి తీసిన చిత్రాన్ని ఇబ్బందిపెట్టాయని ‘అరి’ డైరెక్టర్ జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు

News October 16, 2025

రబీలో కుసుమ సాగుకు అనువైన రకాలు

image

రబీలో సాగుకు అనువైన నూనెగింజ పంటల్లో కుసుమ ఒకటి. ఇది ఔషధ మొక్కగా, నూనెగింజ పంటగా విశిష్ఠ ప్రాధాన్యత కలిగి ఉంది. చల్లని వాతావరణంలో ఇది అధిక దిగుబడినిస్తుంది. అక్టోబరు చివరి వరకు ఈ పంటను నాటుకోవచ్చు. టి.ఎస్.ఎఫ్-1, నారీ-6, నారీ ఎన్.హెచ్-1, పి.బి.ఎన్.ఎస్-12, D.S.H-185, ఎస్.ఎస్.ఎఫ్-708 వంటి రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి. నారీ-6 రకం ముళ్లు లేనిది. ఎకరాకు 7.5kgల నుంచి 10kgల విత్తనం సరిపోతుంది.

News October 16, 2025

జూబ్లీహిల్స్ బై పోల్.. ROAD TO జీహెచ్ఎంసీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గ్రేటర్ ఎన్నికలకు బాటవేయనున్నాయి. అందుకే కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీలు జూబ్లీహిల్స్ బై పోల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి గ్రేటర్‌ను హస్తగతం చేసుకోవాలని అధికార పార్టీ.. ఎలాగైనా విజయం సాధించి గ్రేటర్‌పై పట్టుపోలేదని నిరూపించాలని బీఆర్ఎస్.. అప్పుడు 48 డివిజన్లు గెలిచాం.. జూబ్లిహిల్స్‌లో కాషాయజెండా ఎగురవేసి గ్రేటర్ పీఠం ఎక్కాలని బీజేపీ భావిస్తున్నాయి.