News February 9, 2025
కొయ్యూరు : ఇటుక తలపై జారి పడి బాలుడు మృతి

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ కొత్త బొర్రంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్రి రాజుబాబు కుమారుడు భీమేశ్వరరావు(5)పై సిమెంటు ఇటుక పడి మృతి చెందినట్లు సమాచార హక్కు చట్టం జిల్లా కో ఆర్డినేటర్ మర్రి అర్జున్ రెడ్డి ఆదివారం తెలిపారు. బాలుడు గోడ పక్కన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇటుక జారి తలపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
Similar News
News February 26, 2026
సంపూర్ణ ఆరోగ్యం కోసం ‘ధన్వంతరి గాయత్రీ మంత్రం’

ధన్వంతరి గాయత్రీ మంత్రం అతి పవిత్రమైంది. ఇది మన బుద్ధిని ప్రేరేపించి, జీవశక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యాలను పఠిస్తే అనంత శక్తి సొంతమవుతుందని పండితులు అంటున్నారు. మానసిక స్పష్టత, దివ్యమైన మార్గదర్శకత్వం కోసం దీన్ని పఠించాలని చెబుతున్నారు. మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే| అమృత కలశ హస్తాయ ధీమహి| తన్నో ధన్వంతరి ప్రచోదయాత్||
News February 26, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు(1/2)

విశాఖ నగరంలో భవన నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో GVMC టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధనం ఉంటే వేగంగా, లేకపోతే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా కొందరికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
News February 26, 2026
కుమ్మెర ఘటన.. నేడు SP సంచలన ప్రెస్‌మీట్

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఎస్పీ ఇచ్చే వివరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


