News April 13, 2025
కొయ్యూరు: భారీ వర్షానికి ఎగిరిపోయిన పాఠశాల పైకప్పు

శనివారం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలు రేకులు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. పైకప్పు రేకులు మొత్తం పోవడంతో పాఠశాల నడవని పరిస్థితి నెలకొందని పంచాయతీ సర్పంచి సాగిన ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Similar News
News April 14, 2025
రుతురాజ్ ప్లేస్‌లో ఎవరికో చోటు?

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలపై ఫ్రాంచైజీ దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. మరి వీరిలో ఎవరు సీఎస్కేకు అవసరమో కామెంట్ చేయండి.
News April 14, 2025
గుమ్మడిదల : భార్యతో గొడవ పడి ఆత్మహత్య

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
News April 14, 2025
కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.