News March 4, 2025

కొయ్యూరు: భార్య కళ్లెదుటే భర్త మృతి

image

కొయ్యూరు మండలం నిమ్మలపాలెం సమీపంలో సోమవారం రోడ్డు<<15637815>> ప్రమాదం<<>> లో వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. వేనం గ్రామానికి చెందిన పాంగి భానుచందర్ తన భార్య జ్యోతితో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడి భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోతిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెటుకున్నారు.

Similar News

News November 12, 2025

వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

image

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.

News November 12, 2025

కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బొమ్మన్‌దేవిపల్లి 12°C, నస్రుల్లాబాద్ 12.1, లచ్చపేట 12.4, ఎల్పుగొండ 12.5, సర్వాపూర్ 12.6, గాంధారి,రామలక్ష్మణపల్లి,డోంగ్లి లలో 12.7, బీర్కూర్ 12.9, రామారెడ్డి, మేనూర్‌లలో 13, జుక్కల్, బీబీపేట, ఇసాయిపేటలో 13.1, లింగంపేట, భిక్కనూర్‌లో 13.3, పుల్కల్ 13.5°C లుగా నమోదయ్యాయి.

News November 12, 2025

నేటి నుంచి MGMలో స్పెషల్ సదరం క్యాంపులు

image

నేటి నుంచి ఈ నెల 15 వరకు ఎంజీఎంలో స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మీసేవ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న 1,280 మందికి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న ఫారంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.