News October 7, 2025

కొరమీను చేపల సాగుతో రైతులకు అదనపు ఆదాయం: కలెక్టర్

image

వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగు చేయడం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జీవనోపాదుల మెరుగుదలపై మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కొరమీను చేపలను తక్కువ స్థలంలోనే పెంచవచ్చని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా ఉంటుందన్నారు.

Similar News

News October 7, 2025

పమిడిముక్కల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

పమిడిముక్కల మండలం తాడంకి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చీకుర్తి నరసింహారావు (50) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు.

News October 7, 2025

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

News October 7, 2025

విజయవాడలో జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.