News April 24, 2025

కొరిశపాడు: గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

కొరశపాడుకి చెందిన కాలే బిన్నీ తెలంగాణకు చెందిన వసంత (28)ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా భర్త, అత్తమామలు, తోడికోడళ్ళతో కలిసి వసంత కొరిశపాడులోనే ఉంటుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి వసంత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Similar News

News April 24, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పత్తి ధర ఈరోజు భారీగా పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. ఈరోజు రూ.7,700 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం మంచి విషయం అయినప్పటికీ, పత్తి అందుబాటులో లేని సమయంలో ధర పలకడం పట్ల రైతులు నిరాశ చేందారు.

News April 24, 2025

కేంద్ర హోంశాఖ, IB, RAW ఎమర్జెన్సీ మీటింగ్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, IB డైరెక్టర్, RAW చీఫ్ తదితరులు హాజరయ్యారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

News April 24, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!