News January 8, 2025
కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.
Similar News
News February 25, 2026
సీఎంను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఓ విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 25, 2026
2021లోనే నీళ్లు ఇచ్చేవాడిని: సీఎం

2019 – 24లో సీఎంగా ఉండుంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4,35,000 ఎకరాల సాగుకు నీళ్లు వచ్చేవన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019 – 24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
News February 25, 2026
ఆ సమయంలో ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు: CM

30 ఏళ్ల కిందట మార్కాపురం వచ్చానని, ఆ సమయంలో మీరు కృష్ణా జలాలు ఇవ్వాలని కోరగా.. ఆనాడు హామీ ఇచ్చి, భూమి పూజ చేశాను అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలిగొండ పూర్తిచేసి జాతికి అంకితం చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని సీఎం తెలిపారు. 2014 – 19లో నేరుగా ప్రాజెక్టు దగ్గర వచ్చి పనులను పరిగెత్తించానని, కానీ 2019 – 24 చీకటి రోజులు రావడంతో పనులు ఆటకెక్కాయని చెప్పారు.


