News December 31, 2024
కొరిశపాడు: రోడ్డు మిల్లర్ ఢీకొని బాలుడి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడులో సోమవారం విషాద ఘటన జరిగింది. స్థానిక జగజ్జీవన్ రావ్ కాలనీకి చెందిన దుడ్డు నాగయ్య కుమారుడు గౌతమ్ తన తాతతో కలిసి బైకుపై సెంటర్లో ఉన్న బొడ్డురాయి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు బైక్‌పై కూర్చొని ఉండగా రోడ్లు వేస్తున్న మిల్లర్ రివర్స్‌లో వచ్చి బైకును ఢీకొట్టింది. బాలుడికి బలమైన దెబ్బ తగలడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News February 18, 2026
మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవన్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.
News February 18, 2026
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.


