News July 8, 2024

కొర్లపహాడ్ సమీపంలో ట్రామా కేర్ సెంటర్

image

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక వసతులతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించాలని ఏడీపీ ప్రతిపాదించింది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురైన సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యంతో ఈ సెంటర్ నిర్మాణం చేపడుతోంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కొర్లపహాడ్ టోల్ ప్లాజాను కీలక జంక్షన్‌గా గుర్తించిన ADP ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Similar News

News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

News February 18, 2026

రైతులందరికీ ‘డిజిటల్‌’ గుర్తింపు ఉండాల్సిందే: కలెక్టర్

image

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.