News March 7, 2025

కొలిమిగుండ్ల హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

image

కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో భార్యను రోకలి బండతో దాడి చేసి <<15673390>>హత్య<<>> చేసిన ఘటన తెలిసిందే. ఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గురువారం రాత్రి పరిశీలించారు. కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి మానసిక స్థితి, ఘటనకు గల కారణాలపై స్థానికులతో పాటు, మృతురాలి బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

Similar News

News March 7, 2025

కృష్ణా: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

image

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఆసక్తికి తెరలేపింది.

News March 7, 2025

రాష్ట్రంలోనే టాప్ నిజామాబాద్ జిల్లా

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గురువారం జిల్లాలోని మంచిప్పలో 40.8℃, తూంపల్లిలో 40.7℃ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలు రాష్ట్రంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News March 7, 2025

నరసరావుపేట ఎమ్మెల్యే ధర్నా

image

నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హల్‌చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై ఎక్సైజ్ కమిషనర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడికి చేరుకొని నిరసన తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా ఎమ్మెల్యే అంగీకరించలేదని సమాచారం. చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

error: Content is protected !!