News February 17, 2025
కొల్చారం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి మృతి

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.
Similar News
News February 20, 2025
మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 20, 2025
మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
News February 20, 2025
మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.