News April 15, 2025
కొల్లాపూర్: ‘స్థానిక ఎన్నికల్లో BRS గెలుపు ఖాయం’

మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ సభతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థులు గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే BRS సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News November 8, 2025
ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెడుతున్నారా?

ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ వీటిలో వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గల ఆహారాలను పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్, బీస్‌వాక్స్, వెదురుతో చేసినవి వాడొచ్చు. అవన్నీ విషరహిత పదార్థాలతో తయారు చేయడం వల్ల.. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 8, 2025
కృష్ణా: LLB & BA.LLB కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90- 92 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.
News November 8, 2025
నెల్లూరు: అధికారులకు షోకాజ్ నోటీసుల జారీ

నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DPO శ్రీధర్ తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ టాక్స్ మెటీరియల్ గురించి తప్పుగా నమోదు చేసిన ఉదయగిరి, పెద్దపవని, ఏఎస్ పేట, తాటిపర్తి PSలకు నోటీసులు అందజేశారు. ఎనమాదాల సర్పంచ్ సుందరయ్య ఆరో ప్లాంట్ నిధులు దుర్వినియోగంపై నోటీసులు అందజేశారు.


