News March 27, 2024

కొల్లిపర: పురుగుమందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

కొల్లిపర మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తూములూరుకు  చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు ఆర్థిక సమస్యలతో మంగళవారం పురుగుమందు తాగారు. చంద్రశేఖర్ మృతి చెందగా, నాగలక్ష్మి చికిత్స పొందుతోంది. వీరిది దుగ్గిరాల మండలం ఈమని. డ్రైవరుగా పనిచేసే చంద్రశేఖర్‌ గతేడాది ప్రమాదం బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 3, 2024

విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

News October 3, 2024

గుంటూరు: చిల్లర సమస్యలకు చెక్ పెట్టేలా RTC కీలక నిర్ణయం

image

దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.

News October 3, 2024

చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలి: మంత్రి సవిత

image

చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాణ్యమైన వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.