News March 13, 2025
కొల్లూరు: లారీ బోల్తా

కంకర పోసుకుని వెళుతున్న లారీ బోల్తా పడిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి కంకర లోడ్‌తో గురువారం తెల్లవారుజామున వెళుతుండగా సిమెంట్ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలిపారు.
Similar News
News July 4, 2025
ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.
News July 4, 2025
కోనరావుపేట: ‘జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి’

జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రూ. 5 కోట్ల 14 లక్షలతో చేపట్టిన అదనపు మౌలిక వసతుల నిర్మాణం పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.
News July 4, 2025
వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: చంద్రబాబు

AP: రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను OCT 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.