News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 19, 2025
రాజశేఖర్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం?

వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
News March 19, 2025
కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోచ్చరణతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసిఎస్ రాజు, భావన ఋషి, మేన మహేశ్ బాబు, బండారి మల్లికార్జున్, మల్యాల మండల సీనియర్ నేత ప్రసాద్, బిట్టు పాల్గొన్నారు.
News March 19, 2025
రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: భట్టి

TG: త్వరలోనే 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు.