News November 11, 2025
కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్‌డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
Similar News
News February 19, 2026
తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.
News February 19, 2026
స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

20ల్లోకి అడుగుపెట్టగానే స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్ క్లెన్సర్ ఫేస్ వాష్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. వారానికోసారి స్క్రబ్, పీల్స్ అప్లై చేయాలి. హైలురోనిక్ యాసిడ్, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు, గీతలు దూరం అవుతాయి. వీటితో పాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లున్న ఆహారాన్ని తీసుకోవాలి.
News February 19, 2026
AIIMS గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

<


