News September 27, 2025

‘కొవ్వూరులో 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యం’

image

కొవ్వూరు డివిజన్‌లో ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణకు సుమారు 2.43 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యమని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. శుక్రవారం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలను ఒకే సారి ప్రారంభించి ధాన్యం సేకరణ చేపడతామన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం చెల్లింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 27, 2025

ధవలేశ్వరం: మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద

image

గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు వివరించారు. 3 పంట కాలువలకు 10,600 క్యూసెక్కుల జలాలను అధికారులు విడుదల చేశారు. గోదావరికి వరద మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 25, 2025

కౌలు రైతులకు రుణాలు అందించాలి: కలెక్టర్

image

సీసీఆర్‌సీ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకులు రైతులకు ఇచ్చే పాస్‌బుక్‌లలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలు రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.

News September 25, 2025

రాజమండ్రి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 60 కేసులు నమోదు

image

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ఎండి. అబ్దుల్ నబీ సారధ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 కేసులను నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 51 మందికి జరిమానా విధించగా, ఆరుగురికి రెండు రోజులు, ముగ్గురికి మూడు రోజులు చొప్పున మొత్తం 9 మందికి కోర్టులో జైలు శిక్ష పడింది.