News April 4, 2024
కొవ్వూరు: ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, అతని సోదరుడు అఖిల్ సహకారంతో ప్రేమిస్తున్నానని వెంటపడి బుధవారం అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేశారు. దీనిపై బాలిక కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులపై ఎస్సై జుబేర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 1, 2025
గ్రామ స్థాయిలో GST సూపర్ సేవింగ్స్ పై ప్రచారం తప్పనిసరి: కలెక్టర్

సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన GST – సూపర్ సేవింగ్స్ పై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం జరగాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. సంబంధిత అధికారులు అక్టోబర్ 19 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లోకి వెళ్లి తగ్గించిన ధరల లభ్యతపై స్పష్టత కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలన్నారు.
News October 1, 2025
వైద్య సేవలకు ఆటంకం లేకుండా చర్యలు: కలెక్టర్

రాజమండ్రి: పీహెచ్సీలలో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు పీజీ వైద్యులు, ఇతర డాక్టర్లను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు నిరంతరాయ వైద్య సేవలు అందించేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సమన్వయంతో వైద్య ఆరోగ్య అధికారులు పని చేస్తున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
News October 1, 2025
గాడాల: దళితుడిపై దాడి ఘటనపై ఎస్పీ సీరియస్

కోరుకొండ మండలం గాడాలలో దళిత యువకుడిపై దాడి ఘటనలో ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. మధురపూడికి చెందిన పాముల శ్రీనివాస్ అనే వ్యక్తిపై గత రాత్రి ఇద్దరు తీవ్రంగా దాడి చేయడంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా డీఎస్పీని నియమించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ దాడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.