News February 12, 2025

కొవ్వూరు: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఉమ్మడి తూ.గో జిల్లా వాడపల్లికి చెందిన చిట్రా సూర్య(20) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. రాజమండ్రిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అతడికి ఓ బాలికతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అతడిని బెదిరించి దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News February 12, 2025

KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు

image

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.

News February 12, 2025

లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్‌ వీడియో కాల్స్..!

image

నార్సింగ్ డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి లావణ్యతో తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. పరిచయం పెంచుకోవడం వీరిద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.

News February 12, 2025

KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు 

image

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు. 

error: Content is protected !!