News January 7, 2026

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బస్సు దగ్ధం.. విచారణ వేగవంతం

image

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై జరిగిన RRR ట్రావెల్స్ <<18784837>>బస్సు ప్రమాద<<>> ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారగా..బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్‌నెస్ నిబంధనలపై RTO ఆరా తీస్తున్నారు.

Similar News

News February 13, 2026

అల్లూరి: ఇకపై స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖగా మార్పు

image

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్-21 జారీ చేసిందని స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ అల్లూరి జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖను స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖగా మార్పు చేశారన్నారు. ఇకపై ఇదే పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

News February 13, 2026

BREAKING: కేసముద్రంలో హంగ్.. CONGRESS 8, BRS 8

image

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 8 గెలిచాయి. కాగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సమానంగా వార్డులు గెలవడంతో కేసముద్రంలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. పలుచోట్ల హంగ్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలిచారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, BRS చెరో 8 చోట్ల గెలిచాయి.