News March 28, 2025
కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
Similar News
News March 31, 2025
రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో బొమ్మూరు మురళీకొండకి చెందిన మట్టపల్లి విజయప్రకాశ్ (34) నిన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. విజయప్రకాశ్ అహ్మదాబాద్‌లో ఓఎన్‌జీసిలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఇంటికి ఆనుకుని ఉన్న వేపచెట్టుకు స్కార్ఫ్‌తో ఉరివేసుకున్నాడు. అతని భార్య షారోన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI తెలిపారు.
News March 31, 2025
రాజమండ్రి: విషమంగా అంజలి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్‌లో వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అంజలి (23) తాజా ఆరోగ్య బులిటెన్ విడుదలైంది. 7మంది వైద్యుల కమిటీ వైద్య పరీక్షలు చేసి ఈ ఆరోగ్య నివేదికను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఆమె ఎవరినీ గుర్తించలేని, స్పందించని స్థితిలో ఉందని వారు తెలిపారు. కళ్లకి వెలుతురు చూపినా రెస్పాన్స్ రావటం లేదన్నారు. మొత్తంగా ఆమె పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.
News March 31, 2025
రాజమండ్రి: ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.