News March 8, 2026

కోచ్‌గా గంభీర్.. విమర్శకుల నోళ్లు మూయిస్తారా?

image

టీమ్ ఇండియా కోచ్‌గా ప్రశంసల కంటే <<18976802>>విమర్శలనే<<>> గంభీర్ ఎక్కువ ఎదుర్కొన్నారు. తన వ్యూహాలు, ఎంపికలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడినా, అతడు సపోర్ట్ చేసిన ప్లేయర్ రాణించకున్నా విమర్శకుల దండయాత్ర జరిగేది. కానీ వాటిని దాటుకుని, INDను T20 WC ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ సూర్యకు అవసరమైన సలహాలిస్తూ నడిపించారు. మరి ఇంకో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా? కామెంట్ చేయండి.

Similar News

News April 5, 2026

15 ఏళ్లకే పోర్న్ సైట్‌లో నా ఫొటో పెట్టారు: జాన్వీ

image

డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల 15 ఏళ్లకే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించారు. పోర్న్ వెబ్‌సైట్‌లో తన మార్ఫ్‌డ్ ఫొటోలను అప్‌లోడ్ చేశారని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘తోటి స్టూడెంట్స్ ఆ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు అవి కనిపించాయి. ఆ విషయాన్ని నాకు చెప్పడంతో బాధపడ్డా. సోషల్ మీడియాలో నైతికత లేదని అర్థమైంది. ఇప్పటికీ డీప్ ఫేక్ కారణంగా సమస్యలు వస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 5, 2026

SRH చెత్త రికార్డు

image

హైదరాబాద్ వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH చెత్త రికార్డులను మూటగట్టుకుంది. తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోరు(35/4) చేసిన జట్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో KKR(31/3)vs డెక్కన్ ఛార్జర్స్, RR(32/5)vs RCB, MI(32/4)vsKXIP ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్‌కు పవర్ ప్లేలో ఇదే నాలుగో లోయెస్ట్ స్కోర్(22/3). గతంలో 14/3vsRR, 20/3vsPBKS, 21/3vsRR అత్యల్ప స్కోర్లు చేసింది.

News April 5, 2026

ఆదుకొన్న నితీశ్, క్లాసెన్.. SRH స్కోర్ ఎంతంటే?

image

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో టాపార్డర్ కుప్పకూలినా SRH 156/9 స్కోర్ చేసింది. 7.1 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, ఐదో వికెట్‌కు క్లాసెన్(62), నితీశ్(56) 116 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ 7, అభిషేక్ 0, ఇషాన్ 1, లివింగ్‌స్టోన్ 14 విఫలమయ్యారు. షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ తలో 2, దిగ్వేశ్, సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు.