News August 5, 2024

కోటగిరి పాఠశాల ఘటనపై KTR స్పందన

image

పాఠశాల విద్యార్థులకు గొడ్డుకారం, నూనె పోసి అన్నం పెడుతున్నారన్న ఘటనపై KTR స్పందించారు. ఘటనకు సంబంధించిన ఫొటోతో గత BRS ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మెనూను జత చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మ‌న బడి పిల్ల‌ల‌కు అందాల్సిన ఆహారం ఇదేనా..? పాఠ‌శాల‌ల్లో పెడుతున్న భోజ‌నంపై వీలైనంత త్వ‌ర‌గా స‌మీక్షించాల‌ని తెలంగాణ CSను ఆయన కోరారు.

Similar News

News February 6, 2025

BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.

News February 6, 2025

నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో సుమారు 588 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 6, 2025

నిజామాబాద్: దొంగను పట్టుకున్న గన్‌మెన్‌కు సన్మానం 

image

దొంగను పట్టుకున్న తన గన్‌మెన్ దేవరాజ్‌ను TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు సన్మానించారు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో సంబరాల్లో ఉంటే ఓ దొంగ ఏకంగా 8 సెల్‌ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ తెలియకుండా కొట్టేశాడు. సెల్‌ఫోన్లు కొట్టేస్తున్న ఆ దొంగను దేవరాజ్ చాకచక్యంగా పట్టుకోవడంతో మహేశ్ సన్మానించారు.

error: Content is protected !!