News August 7, 2024

కోటగిరి: రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

image

కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి, 270క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. నెల రోజుల క్రితం ఈ రైస్ మిల్లుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.

Similar News

News February 19, 2026

NZB: 58 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News February 18, 2026

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.