News April 13, 2025
కోటగిరి: సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు ఆత్మహత్య

సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News February 20, 2026
వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాలి: హరీశ్ రావు

సిద్దిపేట 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పాలనలో విఫలమైందని విమర్శించారు. గత బడ్జెట్‌లో గొప్పగా స్పీచ్‌లు ఇచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కనీసం ఈసారైనా వాస్తవాలకు దగ్గరగా, ఆచరణాత్మకమైన బడ్జెట్‌ను రూపొందించాలని హరీశ్ సూచించారు.
News February 20, 2026
జీవన్ రెడ్డికి అవమానం జరగనివ్వొద్దు: జగ్గారెడ్డి

జగిత్యాల రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా చూడాలని కోరారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన ఏనాడూ పార్టీ మారలేదని గుర్తుచేశారు. నిఖార్సైన కాంగ్రెస్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
News February 20, 2026
కంభంలో ACB దాడులు.. లంచం తీసుకుంటూ చిక్కిన అధికారి

మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


