News August 22, 2025

కోటపల్లి: కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు: మంత్రి

image

BRS ప్రభుత్వం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కోటపల్లి మండలంలో పర్యటించి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రైతులు బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్‌ను ఇక్కడ జరిగిన వాటిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు కరకట్టలు కట్టాలని మంత్రిని కోరామన్నారు.

Similar News

News August 22, 2025

రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

image

రాయికల్ మం. అల్లిపూర్‌కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.

News August 22, 2025

గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

News August 22, 2025

BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

image

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <>వెబ్‌సైట్‌<<>> నుంచే పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని తెలిపారు. PGT, SGT, SAలు ఇలా అన్ని విభాగాల మెరిట్ లిస్ట్ వన్ బై వన్ రిలీజ్ అవుతున్నాయని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు.