News January 27, 2025
కోటపల్లి: జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థికి కలెక్టర్ ప్రశంస

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్ కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా నుంచి ఇన్‌స్పైర్మానక్ పోటీల్లో జాతీయస్థాయికి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్‌ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News February 20, 2026
16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే..

సంతోషీ మాత వ్రతాన్నే ‘16 శుక్రవారాల వ్రతం’ అంటారు. ఈ వ్రతం చేస్తే అద్భుత మార్పులుంటాయని నమ్మకం. ‘మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం యోగం లేనివారికి మంచి ఫలితాలుంటాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇల్లు సుఖసంతోషాలతో, ధనదాన్యాలతో విరాజిల్లుతుంది’ అని పండితులు చెబుతున్నారు.
News February 20, 2026
ములుగు: దామోదర్ ఎక్కడ?

మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఎక్కడున్నాడనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత 3 నెలలుగా దామోదర్ లొంగిపోతున్నాడని, పోలీసులు అరెస్టు చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో నిన్న కర్రెగుట్టల్లో సైతం దామోదర్ ఉన్నాడని, మరోవైపు మహా ముత్తారం అడవుల్లో దామోదర్‌ను అదుపులోకి తీసుకున్నారని వార్తలు సైతం వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
News February 20, 2026
పుచ్చ పంటలో పండు ఈగను ఎలా నివారించాలి?

పుచ్చ పంటలో పండు ఈగ తల్లి పురుగులు పూమొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలిచి లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. కాయలు వంకర్లు తిరిగి కుళ్లిపోతాయి. వీటి నివారణకు క్యూల్యూర్ అనే పండు ఈగ ఆకర్షణ బుట్టలు ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పంటకాలం మొత్తం అమర్చుకోవాలి. తీవ్రతను బట్టి లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి.


