News April 14, 2025
కోటపల్లి: నవదంపతుల సూసైడ్

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 15, 2025
సునీల్ నరైన్ రహస్యం అదే: బిస్లా

KKR మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చాలా సీజన్లుగా IPL ఆడుతున్నా ఇప్పటికీ అతడి బౌలింగ్‌ను చాలామంది ఛేదించలేకపోయారు. అందుకు గల కారణాన్ని KKR మాజీ వికెట్ కీపర్ బిస్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నరైన్ తన మిస్టరీని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు. ఆఖరికి నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ బ్యాటర్లకు బౌలింగ్ చేయరు. కీపర్‌ను కాబట్టి నాకు అర్థం కావడం కోసమైనా కొన్ని బంతులు వేయమని నేను అడిగేవాడిని’ అని తెలిపారు.
News April 15, 2025
MDCLలో పలుచోట్ల కురిసిన మోస్తరు వర్షం!

MDCL జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఘట్కేసర్లో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు TGDPS తెలిపింది. కీసరలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. HYD బండ్లగూడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.
News April 15, 2025
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు సీపీ సన్మానం

ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన సత్తుపల్లి యూనిట్ హోంగార్డు ఆఫీసర్ మిట్టపల్లి వాణిని మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని సీపీ కొనియాడారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.