News February 28, 2025
కోటప్పకొండ తిరునాళ్లలో వైసీపీ విద్యుత్ ప్రభపై దాడి

కోటప్పకొండ తిరునాళ్లలో గోనెపూడి వైసీపీ ఎలక్ట్రికల్ ప్రభపై కొందరు దాడి చేసి ప్రభకు నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండ కింద ఏర్పాటు చేసిన 22 ఎలక్ట్రికల్ ప్రభలలో ఒకటి మాత్రమే వైసీపీ ప్రభ ఉంది. ఈ ఘటన సమయంలో వైసీపీ ప్రభ దగ్గరకు వైఎస్సార్ అభిమానులు భారీగా చేరుకున్నారు. తిరునాళ్లలో గోనెపూడి ప్రభ వద్ద జగన్ పాటలు వేయడంతో ప్రత్యర్థులు డీజే బాక్స్‌లను ధ్వంసం చేశారన్నారు.
Similar News
News September 18, 2025
PDPL: ప్రీ- ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 12 ప్రీ- ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా, ఆయాలుగా తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి బుధవారం తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 21లోపు అవకాశం ఉందన్నారు. ఇంటర్, 7వ తరగతి విద్యార్హతలతో 18- 44ఏళ్ల మధ్య వయస్సున్నవారు సంబంధిత HMలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News September 18, 2025
మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్‌లను తొలగించిన ప్రభుత్వం

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.
News September 18, 2025
సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం