News September 2, 2025
కోటబొమ్మాలిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కోటబొమ్మాలి–తిలారు రైల్వే స్టేషన్ మధ్య రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అతని కుడిచేయిపై ‘శ్రీను’ అనే పచ్చబొట్టు ఉందని వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News September 2, 2025
రైతుల కోసం మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న

రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నుంచి మీడియాతో రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులు, ఉల్లి ధరలపై జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమన్నారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మంత్రి అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డారన్నారు.
News September 2, 2025
ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు యూరియా అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మార్పీ ధర కన్నా యూరియా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత రాకూడదని ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చరల్ కోపరేటివ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News September 2, 2025
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో టాప్‌లో నిలవాలి: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు అధిక సంఖ్యలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం వీసి ద్వారా సమీక్ష చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి రూ.లక్ష రివార్డు, జిల్లా స్థాయి అవార్డులకు రూ.25 వేల వరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో అవార్డులను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.