News November 5, 2025

కోటవురట్ల: రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు

image

కోటవురట్ల మండల వైసీపీ అద్యక్ష పదవికి రాజీనామా చేసిన కిలాడ శ్రీనివాసరావుని పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఫోన్‌లో మాట్లాడి తొందర పడవద్దని సూచించారు. బుధవారం ఉదయం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. దత్తుడు సీతబాబు పాల్గొన్నారు.

Similar News

News April 5, 2026

టెన్త్, ఇంటర్ ఫలితాలు.. UPDATE

image

AP: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే పది రోజుల తేడాతో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 9తో పూర్తవుతుంది. మార్కులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించి ఈ నెల 15 తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్‌ను ప్రాసెస్ చేసి ఈ నెల 25 తర్వాత విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News April 5, 2026

నంద్యాల: రేపు రూ.60 వేలు గెలుచుకునే ఛాన్స్!

image

రుద్రవరం మండలం చిన్నకంబలూరులో సోమవారం రాష్ట్రస్థాయి న్యూ కేటగిరీ వృషభరాజముల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గుడ్ ఫ్రైడే – ఈస్టర్ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన క్రైస్తవ సంఘ పెద్దలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన వృషభరాజముల యజమానులకు నగదు బహుమతులను వరుసగా రూ.60,000, రూ.50,000, రూ.40,000, రూ.30,000 అందించనున్నట్లు వెల్లడించారు.

News April 5, 2026

కర్నూలు: 205 ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూ

image

కర్నూలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి దీప్తి తెలిపారు. ఇన్నోవిజన్, GPS రెన్యవబుల్ ఎనర్జీ, బ్లూస్లార్, అంబర్ తదితర సంస్థలు ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 205 ఖాళీలున్నాయని, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.