News February 7, 2025

కోటవురట్ల: ‘వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి’

image

కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ శిశువు మృతి చెందింది. ఏటికొప్పాక నుంచి గర్భిణి కె.సుశీల దేవిని ప్రసవం కోసం ఈనెల 6వ తేదీన స్థానిక సిహెచ్సీలో బంధువులు చేర్పించారు. శుక్రవారం డెలివరీ చేయడంలో వైద్యు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే శిశు మృతి చెందిందని సుశీల దేవి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News February 8, 2025

130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్‌గ్రేడ్

image

విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్‌ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్‌గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్‌బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్‌గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.

News February 8, 2025

దిలావార్ పూర్: విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్ల బందోబస్తు పరిశీలన

image

ఈ నెల 8న నిర్వహించనున్న ధ్యాన హనుమాన్ భారీ శిల్ప విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చే భక్తులు వాహనాలు, సౌకర్యాలను తదితర విషయాలను కార్యక్రమా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.

News February 8, 2025

నల్గొండ: యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

image

మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో వాణి అనే యువతి బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్ కొద్దిరోజులుగా వాణిని వేధిస్తున్నాడు. ఈ కారణంతోనే తమ బిడ్డ ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబీకులు తెలిపారు. దీంతో సతీశ్‌పై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!